5 Star Rating Cars: జూన్ 2025 వరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్‌లు పొందిన 18 కార్లు
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:00 PM
మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మొదట దాని భద్రత గురించి ఆలోచించాలి. ఎలాంటి కార్లకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకుని నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో ఇటీవల 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) పొందిన 18 కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు కారు కొనాలని అనుకుంటున్నారా. ఇలాంటి సమయంలో ఫీచర్లు, మైలేజ్ కంటే ముందు కూడా ఆయా కార్ల రేటింగ్ చూడటం చాలా ముఖ్యం. కార్ల రేటింగ్ వాటి భద్రతను సూచిస్తుంది. అందుకే కొత్త కారు ఎంపికలో మొదటగా దాని safety rating గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.
2023లో ప్రారంభమైన భారత్ NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) భారతదేశంలో కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షిస్తుంది. జూన్ 2025 వరకు, ఈ సంస్థ మొత్తం 21 కార్లను టెస్ట్ చేసింది. వీటిలో 18 కార్లు 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) సాధించాయి. కానీ మారుతి వాగన్ ఆర్ ఈ జాబితాలో లేదు. ఎందుకంటే ఇది ఇంకా భారత్ NCAP ద్వారా పరీక్షించబడలేదు.
భారత్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన 18 కార్ల జాబితా
టాటా హారియర్ EV - అత్యాధునిక ఎలక్ట్రిక్ SUV, భద్రతలో ఉత్తమం.
మహీంద్రా XEV 9e - శక్తివంతమైన డిజైన్, అద్భుతమైన భద్రత.
మహీంద్రా BE 6 - స్టైల్‌తో పాటు సురక్షితమైన ప్రయాణం.
టాటా పంచ్ EV - కాంపాక్ట్ కానీ భద్రతలో బెస్ట్.
మహీంద్రా థార్ ROXX - ఆఫ్-రోడ్‌తో పాటు భద్రతలో 5 స్టార్లు.
స్కోడా కైలాక్ - యూరోపియన్ స్టైల్, భారతీయ భద్రత.
హ్యుందాయ్ టక్సన్ - లగ్జరీ, భద్రతలో అగ్రగామి
టాటా కర్వ్ EV - ఆకర్షణీయ(stats)యమైన డిజైన్, భద్రతలో 5 స్టార్లు.
టొయోటా ఇన్నోవా హైక్రాస్ - కుటుంబ ప్రయాణాలకు సురక్షిత ఎంపిక.
మహీంద్రా XUV 400 EV - ఎలక్ట్రిక్, భద్రమైన డ్రైవింగ్ అనుభవం.
కియా సైరోస్ - స్టైలిష్, సురక్షితం
టాటా హారియర్ - బలమైన బిల్డ్, భద్రతలో టాప్.
టాటా సఫారి - రాయల్ లుక్, 5-స్టార్ భద్రత.
టాటా నెక్సాన్ EV - ఎలక్ట్రిక్ శక్తి, భద్రతలో ఉత్తమం.
టాటా కర్వ్ - సొగసైన డిజైన్, అద్భుతమైన భద్రత.
మారుతి డిజైర్ - సరసమైన ధర, 5-స్టార్ భద్రత.
టాటా నెక్సాన్ - యువత ఇష్టపడే స్టైల్, భద్రత.
మహీంద్రా XUV3XO - కాంపాక్ట్ SUV, భద్రతలో ఉత్తమం.
ఎందుకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
భారత్ NCAP 5 స్టార్ రేటింగ్ అంటే ఆ కారు పెద్దలు, పిల్లల భద్రతలో అత్యుత్తమంగా ఉంటాయని అర్థం. ఈ జాబితాలోని కార్లు ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించబడ్డాయి. ఇవి మీ ప్రయాణాన్ని సురక్షితంగా, ఆనందకరంగా చేస్తాయి.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి