Share News

YSRCP Woman Leader Arrest: పోలీసుల అదుపులోవైసీపీ మహిళా నేత

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:12 AM

కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఆరోపణలపై వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్‌లోని ఆమెను దాచేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

YSRCP Woman Leader Arrest: పోలీసుల అదుపులోవైసీపీ మహిళా నేత

  • కూటమి నేతలపై అసభ్యకర పోస్టులే కారణం

దాచేపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని బుధవారం పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కృష్ణవేణి వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివి్‌స్టగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆమెను దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణవేణి స్వగ్రామం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామం. కూటమి నేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఈమెపై పలు ఫిర్యాదులున్నట్లు సమాచారం.

Updated Date - Apr 17 , 2025 | 05:12 AM