Gorantla Madhav: పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్.. ఎన్ని రోజులంటే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:14 PM
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసుల కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు ఐదు రోజుల కావాలంటూ పోలీసులు కోర్టుకు విన్నవించారు. కానీ రెండు రోజుల మాత్రము పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

గుంటూరు, ఏప్రిల్ 21: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 23, 24వ తేదీల్లో గోరంట్ల మాధవ్‌ను కస్టడీలోకి తీసుకొనేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలంటూ నగరం పాలెం పోలీసులు.. కోర్టును కోరారు. కానీ రెండు రోజులు మాత్రమే గోరంట్ల మాధవ్‌ను కస్టడీకి అనుమతి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏం జరిగిందటే..
ఇటీవల టీడీపీకి చెందని చేబ్రోల్ కిరణ్ కుమార్.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై వీడియోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో చేబ్రోలు కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అతడిని తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గుంటూరు జిల్లా పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకు వస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. చేబ్రోలు కిరణ్‌ను తీసుకు వెళ్తున్న వాహనాన్ని వెంబడించారు. అంతేకాకుండా.. చేబ్రోలు కిరణ్‌పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని నల్లపాడు పీఎస్‌కు తీసుకు వెళ్లారు. అటు నుంచి నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో గోరంట్ల మాధవ్ రాజమండ్రి జైలులో ఉన్నారు.
మరోవైపు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన ఫ్యామిలీని అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ నాటి జగన్ ప్రభుత్వం వీటిపై స్పందించలేదు. అంతేకాదు.. ఈ తరహా వ్యాఖ్యలు తప్పు అంటూ ఖండించిన పాపాన పోలేదు.
దీంతో ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఓటర్లు.. తమ ఓటు హక్కు ద్వారా సమాధానం చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవమే లక్ష్యంగా పని చేస్తూ ముందుకు వెళ్తుంది. దీంతో సొంత పార్టీకి చెందిన వ్యక్తినైనా సరే.. దండించేందుకు తెలుగు దేశం పార్టీ ఏ మాత్రం వెనకాడడం లేదనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్ట్, అతడిపై సస్పెన్షన్ వేటు ఘటనలు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..