Harihara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాపై అంబటి ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:06 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాపై చేసిన ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఆయన ఇలాంటి సందేశం ఇచ్చారనే దానిపై..

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'పవన్ కళ్యాణ్ గారి హరిహర వీర మల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నా!' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు పవన్ కళ్యాణ్, నాగబాబుని ట్యాగ్ చేశారు. ఇది అటు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పోస్ట్ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పెట్టిందా? లేక అంబటి వేరే ఆలోచనతో పెట్టారా? అనే దానిపై చర్చ మొదలైంది. గతంలో పవన్, నాగబాబుల మీద అంబటి ఎన్నో విమర్శనాత్మక పోస్టులు పెట్టారు. బహిరంగంగా పెద్దఎత్తున విమర్శలు, సెటైర్లు వేశారు. అయితే, ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంబటి ఇలాంటి టర్న్ ఎందుకు తీసుకున్నారనే దానిపై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఈ పోస్టును అన్వయించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి