YS Sharmila: బీజేపీతో జగన్‌ది అక్రమ పొత్తు
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:51 AM
బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్‌ది మాత్రం బీజేపీతో అక్రమ పొత్తు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
మచిలీపట్నం, భీమవరం టౌన్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్‌ది మాత్రం బీజేపీతో అక్రమ పొత్తు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్‌కే ఉందన్నారు. కృషా ్ణజిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం మచిలీపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర విభజన హామీలపై దారుణంగా మోసం చేసినా, కూటమి ప్రభుత్వం, వైసీపీ మౌనంగా ఉన్నాయన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలు అమలవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికే జిల్లా పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో పనిచేయనివారు ఎంతటివారైనా పక్కన పెడతామని చెప్పారు. తన జిల్లాల పర్యటన పూర్తయిందన్నారు.