Share News

Police Torture: టీడీపీ హయాంలో వైసీపీ రాజ్యం

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:22 AM

వైసీపీ సర్పంచ్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు హింసించడంతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం

Police Torture: టీడీపీ హయాంలో వైసీపీ రాజ్యం

  • టీడీపీ కార్యకర్తపై దొంగతనం నేరం మోపిన వైసీపీ సర్పంచ్‌

  • నవీన్‌కు పోలీసుల చిత్రహింసలు

  • అవమాన భారంతో ఆత్మహత్య

  • శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన

కదిరి, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్పంచ్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు హింసించడంతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం, రాజనోళ్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త నవీన్‌(23) ఆత్మహత్య చేసుకున్నాడు. టీటీడీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నవీన్‌ సోమవారం బైక్‌పై వెళ్తున్న సమయంలో గ్రా మ సర్పంచ్‌, వైసీపీ నాయకురాలు సుగుణమ్మ కనిపించడంతో పలకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందోగాని, నవీన్‌ను అక్కడే నిలబెట్టిన ఆమె.. దొంగతనం నేరం అంటగట్టారు. తనపై దాడి చేసి, మెడలో ఉన్న చైన్‌ను లాక్కున్నాడ ని సుగుణమ్మ ఆరోపించారు. నవీన్‌పై ఫిర్యాదు రావడంతో ఎస్‌ఐ నరసింహుడు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. చిత్రహింసలు పెట్టారు. తనకు జరిగిన అన్యాయం గురించి నవీన్‌ కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. మరోసారి పోలీసులు పిలవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన నవీన్‌.. సెల్ఫీ వీడియోలో జరిగిందంతా చెప్పి.. ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని చింతచెట్టుకు మంగళవారం ఉరి వేసుకున్నాడు. నవీన్‌కు భార్య రూప, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు.

వైసీపీ నేతల ప్రోద్బలంతోనే!

వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే నవీన్‌ను ఎస్‌ఐ నరసింహుడు చితకబాదారని బాధిత కుటుంబం ఆరోపించింది. మరుసటి రోజు రావాలని చెప్పి పోలీసులు వదిలిపెట్టడంతో సోమవారం రాత్రి 9.30 గంటలకు నవీన్‌ ఇంటి కి చేరుకున్నాడని, మరోసారి స్టేషన్‌కు వెళ్లాలని, ఆధార్‌ కార్డు తీసి ఉంచమని భార్యకు చెప్పి.. మంగళవారం ఉదయం బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఊరంతా గాలించగా, గ్రామ సమీపంలోని ఓ చింతచెట్టుకు నవీన్‌ ఉరి వేసుకుని కనిపించాడన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మృతదేహంతో పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహాన్ని తీసుకువెళ్లి సర్పంచ్‌ సుగుణమ్మ ఇంటిముందు బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. నవీన్‌ భార్య ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమో దు చేశామని సీఐ నాగేంద్ర తెలిపారు. సర్పంచ్‌ సుగుణమ్మ, ఆమె కుటుంబ సభ్యులు రాజనాల సుబ్బారెడ్డి, రఘునాథ రెడ్డి, వాసుదేవరెడ్డి, గంగులమ్మ, చందు, విశ్వనాథరెడ్డిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు నవీన్‌ ఆత్మహత్యకు రాజకీయాలే కారణమని బంధువులు చెబుతున్నారు. గత ఎన్నికలలో టీడీపీ మద్దతుతో నవీన్‌ తల్లి ప్రమీల సర్పంచ్‌గా పోటీ చేశారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రమీలపై సుగుణమ్మ ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి సుగుణమ్మ కుటుంబం కక్ష పెంచుకుందని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:22 AM