Womens Day 2025: టీచర్ నుంచి హోంమంత్రిగా..
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:00 PM
Womens Day 2025: మహిళ తలుచుకుంటే సాధించలేనదంటూ ఏమీ లేదు. కొందరు మహిళలు పరిస్థితులు అనుకూలించక, భయంతో ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ, తమపై తమకు విశ్వాసం ఉండాలేగానీ.. సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు పలువురు మహిళలు. అలాంటి సక్సెస్ స్టోరీల్లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత జీవితం కూడా ఒకటి.. ఆమె ప్రస్థానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇదీ వంగలపూడి అనిత ప్రస్థానం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం
వైసీపీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి ఫైర్ బ్రాండ్‌గా మారిన అనిత
నక్కపల్లి, మార్చి 8 : ఆమె ఒకప్పుడు టీచర్.. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వున్నప్పటికీ సహకరించని పరిస్థితులు.. ఆమెకు వున్న పరిజ్ఞానం, విద్యార్హతను చూసి నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. తాను టీచర్‌గా పనిచేసిన నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండోసారి కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా డీలా పడ లేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా అప్పజెప్పిన పనిని సమర్థతతో చేయగలిగారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గొంతెత్తేందుకు ఎందరో వెనుకడుగు వేసినా.. ఆమె తన పదునైన వాగ్ధాటితో, నేరుగా జగన్‌పైనే అస్త్రశస్త్రాలు సంధించిన లేడీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో రెండోసారి గెలవడంతో ఆమె శ్రమను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిని ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత అభిప్రాయాలివి..
రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించి, చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించిన మహారాజు ఎన్టీఆర్. అందుకే ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను ప్రోత్సహించి మొదటిసారి టిక్కెట్ ఇచ్చి ఎమ్మె ల్యే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మా తండ్రి, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు రుణపడి వుంటా. భవిష్యత్ బాగుంటుందనే ఒకే ఒక ఆశతో నిరంతరం శ్రమించాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రక్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శక్తి యాప్‌ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను హోంమంత్రి అనిత.
Also Read:
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్
పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలు..
BSNL హోలీ గిఫ్ట్.. 365 రోజుల ఫ్రీ కాల్స్..
For More Andhra Pradesh News and Telugu News..