Youth Violence: భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:06 AM
Youth Violence: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి...

West Godavari: భీమవరం (Bhimavaram)లో మద్యం మత్తులో యువకులు వీరంగం (youth drunken incident) సృష్టించారు. కాలేజీ బస్సు (College Bus)లో వెళుతున్న ఓ విద్యార్థి (Student)పై యువకులు మూకుమ్మడిగా దాడి (youth violence) చేశారు. అనంతరం యువకులు నడిరోడ్డుపై వెకిలి చేష్టలు, డ్యాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం భీమవరంలో జరిగింది.
భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి బస్సు దిగి వచ్చి తనను ఎందుకు కొట్టారని ప్రశ్నించాడు. దీంతో ఆకతాయిలందరూ ఆ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి.. దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. తర్వాత ఆకతాయిలు మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారు.
కాగా, ఈ ఆకతాయిలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా భీమవరంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాలేజీ బస్సుల్లో వెళుతున్న విద్యార్థులు, విద్యార్థినిల పట్ల ఆకతాయిలు వేధింపులకు పాల్పడేవారు. అయితే అప్పట్లో ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తేలిగ్గా వదిలేయడంతో మళ్లీ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై యువకుల వికృత చేష్టలను అరికట్టాలని భీమవరం వాసులు కోరుతున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి:
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
For More AP News and Telugu News