Share News

Maoists Arrest: మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 08:19 AM

ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Maoists Arrest: మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

ఏలూరు, నవంబర్ 21: ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా కేబుల్ పని చేస్తామంటూ ఇల్లు అద్దెకు దిగారు. నెలకు రూ. 10 వేలు చొప్పున అద్దె చెల్లిస్తామంటూ ఆ ఇంట్లోకి మావోయిస్టులు దిగారు. ఆ ఇంట్లో భారీగా మనుషులు ఉన్నా.. వారిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చి.. ఆహారం తీసుకువచ్చే వారని స్థానికులు వెల్లడించారు. మిగిలిన వారంతా ఇంట్లోనే ఉండేవారని చెప్పారు.


అక్టోబర్ 26వ తేదీన మావోయిస్టులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ఇల్లు వెతుక్కుంటూ స్వయంగా వారే వచ్చారా? లేకుంటే ఎవరైనా మధ్యవర్తిత్వం వహించారా? అలా అయితే ఆ మధ్యవర్తిత్వం వహించిన వాళ్లు ఎవరనే కోణంలో పోలీసులు.. ఆ ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.


నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంప చోడవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజేతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. అదే రోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని ప్రధాన నగరాలు విజయవాడ, కాకినాడ, ఏలూరుల్లో మొత్తం 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు

రాష్ట్రంలో అర్బన్‌ నక్సల్స్‌ జల్సాలు

For More AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 08:42 AM