Share News

Dwaraka Tirumala: మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

ABN , Publish Date - May 11 , 2025 | 09:20 AM

Dwaraka Tirumala: చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు.

Dwaraka Tirumala: మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
Dwaraka Tirumala

పశ్చిమ గోదావరి: ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న (Chinna Venkanna) ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు (5th day) ఆదివారం స్వామి వారు మోహిని అలంకరణ (Mohini Alankaram)లో భక్తులకు (Devotees) దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామి వారి ఊరేగింపు జరగనుంది. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది.


చిన వెంకన్నకు టీటీడీ పట్టు వస్త్రాలు..

కాగా చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువస్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏఈవో నటరాజారావుకు అందించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం రోజున తిరుమల దేవస్థానం తరపున అందించాలని కోరారు.

Also Read: పాకిస్తాన్ వక్రబుద్ధి.. నమ్మక ద్రోహం...


కాగా సప్త అశ్వాలను అధిరోహించిన సూర్యభగవానుడిని వాహనంగా చేసుకుని చిన్నతిరుమలేశుడు శుక్రవారం ఉదయం పురవీథుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారిని ప్రత్యేక అలంకరణ చేసి హారతులిచ్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గజసేవతో అట్టహాసంగా తిరువీథులకు తీసుకెళ్లారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు

అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..

For More AP News and Telugu News

Updated Date - May 11 , 2025 | 09:20 AM