Share News

Shocking Incident: భీమవరంలో దారుణం.. నడిరోడ్డుపై కత్తిపట్టుకుని

ABN , Publish Date - May 03 , 2025 | 03:38 PM

Shocking Incident: నడిరోడ్డుపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అతడు చేసే పనిని అక్కడి ప్రజలు చూస్తున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆ వ్యక్తి నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయాడు.

Shocking Incident: భీమవరంలో దారుణం.. నడిరోడ్డుపై కత్తిపట్టుకుని
Shocking Incident Bhimavaram

పశ్చిమగోదావరి, మే 3: మతిస్థిమితం లేని వ్యక్తులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. వారిని ఎంతకనిపెట్టుకుని ఉన్నప్పటికీ ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెట్టుకుంటారు. తమను తాము హానీ చేసుకోవడమో.. లేక ఇతరులపై దాడి చేయడమో చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు రోడ్లపైకి వస్తే జనం పరిస్థితి ఇక అంతే. ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియక భయాందోళనకు గురవుతుంటారు. అయితే భీమవరంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనితో ప్రజలు వణికిపోయారు. అతడి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ఇంతకీ అతడు ఏం చేశాడు.. ప్రజల భయాందోళనకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జిల్లాలోని భీమవరంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై హల్‌చల్ చేశాడు. అతడు చేస్తున్న పని చూస్తి అంతా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే అతడు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఆ వ్యక్తి చేస్తున్న పనిని చూస్తూ కూడా ప్రజలు, స్థానికులు పట్టించుకోలేదు. చివరకు అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

AP Ration Card: రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్


ఈరోజు (శనివారం) ఉదయం నడిరోడ్డుపై వచ్చిన మత్తిస్థిమితం లేని వ్యక్తి తనతో పాటు కత్తిని తెచ్చుకున్నారు. జనాల మధ్యలో నిలబడి తన పీకను తానే కోసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న జనం చూస్తున్నప్పటికీ కూడా దగ్గరకు వెళ్లలేదు. అతడు చేసే పనిని చూస్తూ నిలబడ్డారే తప్ప ఆపే ప్రయత్నమూ చేయలేదు. దీంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి నడిరోడ్డుపై పీకకోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఉండికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే సదరు వ్యక్తి తొలుత యనమదర్రు డ్రైన్‌లోకి దూకగా.. అతడిని పోలీసులు రక్షించారు. ఆ తరువాత మల్లిప్లెక్స్ ఎదుట కత్తితో హల్‌చల్ చేశాడు. కాలు దగ్గర కోసుకున్నాడు కూడా. అనంతరం పీకకోసుకోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి వివరాలు సేకరించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.


ఇవి కూడా చదవండి

AP Ration Card: రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్

Kasireddy SIT Custody: తొలిరోజు అలా... రెండో రోజు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారో


Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2025 | 03:38 PM