Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సింగ్
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:46 AM
Gunman Bag Missing: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ నిమిత్తం సాలూరు వెళ్లిన ఆయన.. బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించి వెంటనే విజయనగరం చేరుకుని బ్యాగ్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

విజయనగరం, ఫిబ్రవరి 14: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ మతిమరుపు ఆయన ఉద్యోగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అని ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఆర్మూర్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జీవీ రమణ కొంతకాలంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సాలూరులోని మంత్రి నివాసానికి వెళ్లేందుకు బయలుదేరి విజయనగరం కలెక్టరేట్ దగ్గర బస్ కోసం వేచి ఉన్నారు. బస్ వచ్చే సరికి తన బ్యాగ్‌ను బస్‌స్టాప్‌లో మరిచిపోయి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్‌లో 30 తుపాకీ తూటాలు, విధి నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు ఉన్నాయి. బ్యాగ్ మిస్ అవడంతో కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా... ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ నిమిత్తం సాలూరు వెళ్లిన ఆయన.. బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించి వెంటనే విజయనగరం చేరుకుని బ్యాగ్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే ఎంత వెతికిన బ్యాగ్ కనపడకపోవడంతో నిన్న జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు రమణ. దీనిపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తూటాలు తీసుకెళ్తున్న బ్యాగ్‌ను మర్చిపోవడంతో పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఆగ్రహించారు. వన్‌పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదు అవగా.. మిస్ అయిన బ్యాగు కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
మీర్‌పేట్‌లో రెచ్చిపోయిన హోటల్ నిర్వాహకులు..
విజయనగరం కలెక్టరేట్, కనపాక, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ బ్యాగ్ ఆచూకీ లభించలేదు. అక్కడి స్థానిక ప్రజలను కూడా బ్యాగ్ గురించి ఆరా తీశారు. ఎవరికీ కూడా తెలియదనే సమాధానమే వచ్చింది. అయితే బ్యాగ్‌ను బస్‌స్టాండ్‌లో పెట్టి మర్చిపోయారా లేక బస్‌లో మర్చిపోయారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 30 బుల్లెట్లు ఉన్న బ్యాగ్‌ను మర్చిపోవడాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News