Share News

Anitha: వైసీపీ తెచ్చిన దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా..: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Mar 04 , 2025 | 01:15 PM

ఏపీ శాసనమండలిలో దిశా చట్టం, దిశా యాప్‌పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు.

Anitha: వైసీపీ తెచ్చిన  దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా..: హోంమంత్రి అనిత
Home Minister Vangalapudi Anitha

అమరావతి: ఏపీ శాసనమండలి (AP Legislative Council)లో దిశా చట్టం (Disha Act), దిశా యాప్‌ (Disha App)పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) మాట్లాడుతూ.. గత (వైసీపీ ప్రభుత్వం హాయాంలో) ఐదు సంవత్సరాల్లో దిశా యాప్‌ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని.. దిశా చట్టమంటూ... చట్టబద్ధతలేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దిశా యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోం మంత్రి డిమాండ్ చేశారు. అసలు దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా.. లేదా.. అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు.

Read More..:

అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా..


అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను అధికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది.. హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్‌ నిరోధించడానికి.. నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని.. ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం జీవోఎంఎస్ నెం. 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. డీఐజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు.


దిశా చట్టం ఉంది.. వైసీపీ..

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. దిశా యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్‌లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దిశా యాప్ ఇప్పుడు ప్రభుత్వం వాడకపోతే... దాని స్థానంలో కొత్త యాప్‌ని తీసుకొస్తున్నారా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

వరుదు కళ్యాణి వ్యాఖ్యలకు సమాధానంగా... దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు హోమ్ మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతల హల్ చల్..

అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం..

పోస్టల్ ఏజెంట్ అక్రమాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 04 , 2025 | 01:15 PM