Visakha Metro: విశాఖలో మెట్రో పరుగులు..
ABN , Publish Date - Apr 28 , 2025 | 10:44 AM
విశాఖ: సాగరతీర నగరం వైజాగ్‌లో మెట్రో చాలా మంది కల. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభజించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు.

విశాఖపట్నం: నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు (Metro Rail Project) నాలుగేళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) అధికంగా ఉన్నందున పరిష్కారం లభించేలా మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలన్నారు. (ఈనెల 11న విజయవాడలో జరిగిన సమావేశం) ఈ నేపథ్యంలో మొత్తం 11,498 కోట్లకు పైగా అంచనా వ్యయంతో విశాఖపట్నం మెట్రో పనులు వేగం పుంచుకున్నాయి. 3వ దశలో 3వ దశ కారిడార్లు 46.23 కిలో మీటర్ల దూరం, 42 స్టేషన్లు ఉండనున్నాయి. విశాఖలో భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు. జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం రూ. 224 కోట్లతో ఆహ్వానించారు. బిడ్‌లు 09.06.2025న తెరుచుకుంటాయి.
Also Read: హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
పర్యావరణ అనుకూలంగా..
విశాఖపట్నం మెట్రోను పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కార్బన్ ఉద్గారాలను దాదాపు జీరో లెవల్‌కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైన విద్యుతును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. ప్రయాణాన్ని మరింత హాయిగా మార్చేందుకు ట్రాక్ వెంట పచ్చదనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్లు, డిపోలు, సర్వీస్ భవనాలు, వయాడక్టులు, పార్కింగ్ షెల్టర్లపై సోలార్ పివి ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, పగటి సమయంలో సహజ విద్యుత్‌ను ఉపయోగించనున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైన విద్యుతును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా విశాఖపట్నం మెట్రో, స్మార్ట్ టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణను టార్గెట్‌గా పెట్టుకుంది.
కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను త్వరిత గతిన పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు.
మూడు కారిడార్లతో మొదటి దశ..
మొదటి దశ: మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లు.
రెండో దశ: కొమ్మడి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 8 కిలోమీటర్ల నాల్గవ కారిడార్.
మొత్తం ఖర్చు: రూ. 11,498 కోట్లకు పైగా అంచనా, కేంద్రం నుంచి 100 శాతం గ్రాంట్ కోసం ఆశిస్తున్నారు.
ఈ క్రమంలోనే మొదటి దశ కోసం జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం రూ. 224 కోట్లతో ఆహ్వానించారు.
కారిడార్ వారీగా వైజాగ్ మెట్రో మార్గాలు...
కారిడార్ I: స్టీల్ ప్లాంట్ – కొమ్మడి జంక్షన్ (34.4 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: గాజువాక, NAD జంక్షన్, ఎయిర్‌పోర్ట్, MVP కాలనీ, యేందాడ, మధురవాడ
కారిడార్ II: గురుద్వారా – పాత పోస్టాఫీస్ (5.07 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: డ్వారకానగర్, RTC కాంప్లెక్స్, దబా గార్డెన్స్, పూర్ణ మార్కెట్
కారిడార్ III: తాటిచెట్లపాలెం – చినవాల్తేరు (6.75 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: RTC కాంప్లెక్స్, సిరిపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఆర్కే బీచ్
కారిడార్ IV (రెండో దశ): కొమ్మడి – భోగాపురం ఎయిర్‌పోర్ట్ (8 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: మారికావలస, గంభీరాం, తగరపువలస, భోగాపురం
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News