Ganta Slams Jagan: జగన్‌ను డిస్‌క్వాలిఫై చేయాల్సిందే: ఎమ్మెల్యే గంటా
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:56 PM
Ganta Slams Jagan: జగన్ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. 151 నుంచి 11కు ఎలా పడిపోయావో తెలుసుకోవాలని హితవుపలికారు. జగన్ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

విశాఖపట్నం, జూన్ 24: మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan) రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారని మండిపడ్డారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర సూపర్ సక్సెస్ అవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. ఈ అంశాన్ని డైవర్షన్ చేసేందుకు పరామర్శల పేరుతో నాటకాలాడారని విమర్శించారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేశాడని ఫైర్ అయ్యారు. చనిపోయిన సింగయ్య మా పార్టీ వ్యక్తి, మీకేంటి బాధ అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మానవత్వం ఉంటే ఇప్పటికైనా సింగయ్య ఇంటికి వెళ్లి మాట్లాడి క్షమాపణ చెప్పి ఉండేవారన్నారు. ఆస్తి కోసం చెల్లిని, తల్లిని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ చూశారని గంటా గుర్తు చేశారు.
నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా అంటూ ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్న జగన్.. నాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ను ఎలా అడ్డుకున్నారో అందరికీ గుర్తుందన్నారు గంటా. జగన్ మాటలు చూస్తుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. 151 నుంచి 11కు ఎలా పడిపోయావో తెలుసుకోవాలని హితవుపలికారు. జగన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘జగన్... ఇవి ప్రమాదాలు కాదు.. నువ్వు చేసిన హత్యలు.. ఇలాంటి వ్యక్తులను డిస్‌క్వాలిఫై చేయాలి. అసెంబ్లీకి రాని వ్యక్తి , రాజీనామా చేయాలి’ అని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
అన్నింటికీ జగనే కారణం: యనమల
ఆపరేషన్ మాఫియా పేరిట రాష్ట్రంలో జగన్ రక్తపాతం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Former Minister Yanamala Ramakrishnudu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని చూపించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని విధ్వంసకర వ్యూహాలకు జగనే మూలకారణమన్నారు. జగన్ చేసే కుట్రలను విజ్ఞులైన ప్రజలు విశ్వసించరని తెలిపారు. జగన్ చర్యలు సోషలిజం, అంబేడ్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ యుద్ధం సృష్టించే రాబందు చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి
జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు
ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్
Read Latest AP News And Telugu News