Anitha: విశాఖలో హోంమంత్రి పర్యటన.. పీఎస్‌లో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 02:58 PM
Vangalapudi Anitha: పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్‌షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని.. ట్రాఫిక్, పార్కింగ్‌పై దృష్టి సారించాలన్నారు.

విశాఖపట్నం, జనవరి 20: హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు హోంమంత్రి. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించిన అనిత.. రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్‌షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని.. ట్రాఫిక్, పార్కింగ్‌పై దృష్టి సారించాలన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రజల కష్టం వినాలన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ కాఫీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించవద్దన్నారు. వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి. సింహాచలం ఆలయంలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళా కానిస్టేబుల్స్‌తో మాట్లాడి.. వారి యోగక్షేమాలను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు.
పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా.. డీజీపీ ఏమన్నారంటే
అప్పన్న సన్నిధిలో...
కాగా.. ఈరోజు ఉదయం విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం అనితకు పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు అప్పన్నస్వామి వారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు రూ.11,400 కోట్లు నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. గత ప్రభుత్వంలో స్టీల్ ఫ్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు.
గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి స్టీల్ ఫ్లాంట్ పేరుతో పాదయాత్ర చేశారని.. వైసీపీ పాలనలో ప్లాంట్ కోసం ఆఖరి రోజు కూడా రాజీనామాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేరు.. జగన్ ఢిల్లీ పర్యటన వేరన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఉమ్మిడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమలు వస్తున్నాయన్నారు. గతంలో దావోస్ పర్యటన అంటే మంత్రులు చలి అనేవారని.. ఇప్పుడు దావోస్ పర్యటనతో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. దిశ చట్టం పేరుతో బూచి చూపించారని.. ఇప్పుడు పోలీసులు కేసులు త్వరగా పరిష్కరిస్తున్నారన్నారు. ఖైదీలకు కూడా శిక్షలు త్వరగా పడుతున్నాయన్నారు. ప్రస్తుతం పోలీసులు వినూత్నంగా ఆలోచన చేస్తున్నారని.. ప్రజల దగ్గరికే పోలీసులు వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
అక్కడికి వెళ్లిన తెలుగు సీఎంలు.. విషయం ఇదే..
Read Latest AP News And Telugu News