Cyclone Montha Effect: మొంథా తుపాన్.. రైల్వే శాఖ కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:05 PM
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
విశాఖపట్నం, అక్టోబర్ 27: మొంథా తుపాన్ (Cyclone Montha) ఆంధ్రా వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. తుపాన్ కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీతోపాటు పలు ప్రధాన రైళ్లు, పలు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా సాగే రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. క్యాన్సెల్ అయిన రైలు సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. తుపాన్ తీవ్రతను బట్టి రైల్వే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రద్దయిన రైళ్లు ఇవే..
27, 28 తేదీల్లో 18515/16 విశాఖపట్నం - కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 28 తేదీల్లో 18525/26 విశాఖపట్నం - బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27వ తేదీన 22707 విశాఖపట్నం - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
27వ తేదీన 17243/44 గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27వ తేదీన 12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దు
27వ తేదీన 12738 విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడిచే గరీబ్ రథ్ రద్దు
27వ తేదీన 22707 విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
27, 29 తేదీల్లో 20805/06 విశాఖపట్నం - న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 29 తేదీల్లో 18519/20 ఎల్టీటీ - విశాఖపట్నం (LTT ఎక్స్‌ప్రెస్) రాకపోకలు రద్దు
27, 28 తేదీన 12861/ 62 విశాఖపట్నం - మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
27, 28 తేదీల్లో 22869/70 విశాఖపట్నం - MGR చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 28 తేదీల్లో 08583/84 విశాఖపట్నం - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 28 తేదీల్లో 18512/11 విశాఖపట్నం - కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 28 తేదీల్లో 67287/88 విశాఖపట్నం - కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు
27, 28 తేదీల్లో 67287/88 విశాఖపట్నం - విజయనగరం (MEMU) రైలు రాకపోకలు రద్దు
28వ తేదీన 67289/90 విశాఖపట్నం - పలాస (MEMU) రాకపోకలు రద్దు
28వ తేదీన 67285/86 రాజమండ్రి - విశాఖపట్నం (MEMU) రాకపోకలు రద్దు
28వ తేదీన 17267/68 విశాఖపట్నం - కాకినాడ ఎక్స్ ప్రెస్ రాకపోకలు రద్దు
28వ తేదీన 58501/02 కిరండూల్ - విశాఖపట్నం ప్యాసింజర్ రైలు రాకపోకలు రద్దు
28వ తేదీన 58538/37 కోరాపుట్ - విశాఖపట్నం రాకపోకలు రద్దు
28వ తేదీన 22875/76 విశాఖపట్నం - గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు రద్దు
28వ తేదీన 58531/32 బ్రహ్మపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ రాకపోకలు రద్దు
28వ తేదీన 58506/05 విశాఖపట్నం - గుణుపూర్ ప్యాసింజర్ రాకపోకలు రద్దు
28, 29 తేదీల్లో 68433/34 కటక్ - గుణుపూర్ (memu) రైలు రాకపోకలు రద్దు
ఇవి కూడా చదవండి..
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురుగాలులతో వర్షాలు స్టార్ట్
Read latest AP News And Telugu News