Minister Nimmala: ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్..
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 PM
తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.

విశాఖ: ఉత్తరాంధ్ర (Uttarandhra) ప్రజల ఋణం తీర్చుకునేలా రాష్ట్రంలో ప్రాజెక్టులను (Projects) పూర్తి చేస్తామని, ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని ఏపీ నీటీపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ( Minister Nimmala Ramanaidu) అన్నారు. బుధవారం ఆయన విశాఖ (Visakha)లో మీడియా సమావేశంలో మాట్లాడారు.. జగన్ (Jagan) హయాంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రాజెక్టుల నిర్వహణ అసలు పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ (TDP) హయంలో అభివృద్ధి జరిగితే, వైసీపీ (YCP) హయంలో విధ్వంసం జరిగిందని అన్నారు.
Also Read..: తెలంగాణలో కలకలం రేపుతున్న కేసులు
జగన్ హయంలో పోలవరం విధ్వంసం..
తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు. పోలవరంపై జగన్ కక్ష కట్టారని.. అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని మూడు డేట్స్ చెప్పినా జగన్ పూర్తి చేయలేదన్నారు. డయా ఫ్రం వాల్‌ను పట్టించుకోలేదన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు తట్టెడు మట్టి జగన్ వేయలేదు.. ఇప్పుడు మేము పనులు వేగవంతం చేశామన్నారు.
ఉత్తరాంధ్రకు కొత్త కంపెనీలు
ఉత్తరాంధ్రలో వైసీపీ హయంలో 5 ఏళ్లలో 5 పైసల కూడా ఖర్చు పెట్టలేదని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నమ్మల తెలిపారు. పోలవరం ఎత్తు విషయంలో వైపీపీది అసత్య ప్రచారమని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనాలు, నదుల అనుసంధానం నెరవేరాలంటే 45.72 మీటర్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నారు. నిర్వాసితుల పరిహారం పూర్తి చేసే వరకు 41.72 దగ్గర కాంటూరుకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రకు కొత్త కంపెనీలు వస్తాయన్నారు. వైఎస్ జగన్ ఉత్తరాంద్ర యువత పొట్ట కొట్టారని, యువతకు ఉపాధి కల్పించే విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
వైసీపీ దాస్టికాలు..
వైసీపీ దాస్టికాలు భరించలేక అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కొత్త కొత్త కంపెనీలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తుంటే వైసీపీ నేతలు ఆవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కంటే వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఋషి కొండ ప్యాలెస్.. ఋషికొండ వైట్ ఏలిపేంట్ మాదిరిగా తయారు అయిందన్నారు. ఋషికొండ భవనాలు వినియోగంపై ఆలోచన చేస్తున్నామని రామానాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కూడా చంపండి అంటే మోదీకి చెప్పుకో అన్నారు
విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చి చంపారు..
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
For More AP News and Telugu News