Conditional Permission : విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:14 AM
మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి (ఫిబ్రవరి 1): మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వైఎస్ జగన్ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్న నేపథ్యంలో ఆయన విదేశాలు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. దీంతో గత నెల 24న నెల రోజులు నార్వే, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సాయిరెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు నెల కాకుండా 15 రోజులు విదేశాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 10వ తేదీ నుంచి వచ్చే మార్చి 10వ తేదీ మధ్య విదేశీ పర్యటనకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News