Share News

Vignan University Convocation: ఆగస్టు 2, 3 తేదీల్లో విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:00 AM

గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం..

Vignan University Convocation: ఆగస్టు 2, 3 తేదీల్లో విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవాలు

  • హాజరుకానున్న గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌

గుంటూరు (విద్య) జూలై 24 (ఆంధ్రజ్యోతి): గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య పి. నాగభూషణ్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాలను యూనివర్సిటీలో ఆవిష్కరిం చారు. ఈసందర్భంగా ఆచార్య పి. నాగభూషణ్‌ మాట్లాడుతూ... ఆగస్టు 3వ తేదీన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ 3వ, పాలిటెక్నిక్‌ ఎడ్యుకేషన్‌ మొదటి స్నాతకోత్సవాలను కలిపి సంయుక్తంగా నిర్వహిసు ్తన్నట్లు తెలిపారు. ఆగస్టు 2న జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవుతున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని ఐ ల్యాబ్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ చింతలపాటి శ్రీనివాసరాజు, జెన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అట్లూరి, మ్యూజిక్‌ గురు, ఇండియన్‌ ప్లేబాక్‌ సింగర్‌ కంపోజర్‌, లిటిల్‌ మ్యాజిషియన్స్‌ అకాడమీ ఫౌండర్‌ డాక్టర్‌ కొమాండూరి రామాచారి హాజరవుతున్నారని, వీరికి గౌరవ డాక్టరేట్‌లు అందజేయనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీలు అందజేయనున్నట్లు వివరించారు. వేడుకల్లో బ్రాంచ్‌ల వారీగా అత్యుత్తమ ప్రతిభ చూపిన 26 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:00 AM