Prakasam District: గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:27 AM
ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చీమకుర్తి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్యెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి చెందిన సూర్యా గ్రానైట్ క్వారీలో డంపర్ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ క్వారీల్లో నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారు.., కార్మికుల భద్రతపై తీసుకుంటున్న చర్యలు.., క్వారీయింగ్ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.