Share News

Ram Mohan Naidu: నా పని తీరుపై మూడు నిఘా నేత్రాలు

ABN , Publish Date - May 23 , 2025 | 06:50 AM

నాపై మోదీ, చంద్రబాబు, ప్రజల నిఘా ఉంది కాబట్టే పని తీరు మెరుగుపరుచుకుంటున్నాను అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Ram Mohan Naidu: నా పని తీరుపై మూడు నిఘా నేత్రాలు

  • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సిక్కోలు ప్రజలు

  • అందుకే మరింత మెరుగ్గా పనిచేస్తున్నా: రామ్మోహన్‌

శ్రీకాకుళం, మే 22(ఆంధ్రజ్యోతి): ‘నాపై మూడు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. ఒకరు ప్రధాని మోదీ, రెండు సీఎం చంద్రబాబు, మూడు సిక్కోలు జిల్లా ప్రజలు. వీళ్లంతా నా పనితీరును తూనికతో కొలుస్తున్నారు’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. అందుకే ఎప్పటికప్పుడు మెరుగ్గా పని చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా మహానాడులో ఆయన మాట్లాడారు. దేశంలో కొత్తగా 50 ఎయిర్‌ పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో శ్రీకాకుళం జిల్లా పలాస కూడా ఉందని చెప్పారు.

Updated Date - May 23 , 2025 | 06:51 AM