Tirumula: ఢిల్లీ శ్రీవారి ఆలయంలో అధికారుల అత్యుత్సాహం
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:35 AM
ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం..

టీటీడీ అనుమతి లేకుండా నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ
ఉన్నతాధికారులకు విజిలెన్స్ నివేదిక
తిరుమల, జూలై28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలోని గోల్మార్కెట్‌లో టీటీడీ అధీనంలో బాలాజీ టెంపుల్ ఉంది. అక్కడున్న ప్రత్యేకాధికారి, అధికారులు, అర్చకులు, వేదపారాయణదారులు మే నెలలో నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు అక్కడున్న కొంతమంది సిబ్బంది నుంచి టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారమందింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన క్రమంలో అధికారుల బృందం గతనెల్లో విచారణ చేపట్టి టీటీడీకి నివేదికను సమర్పించింది. టీటీడీ ఆగమ సలహా మండలి, ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతులు లేకుండానే వైజాగ్ నుంచి విగ్రహాన్ని తెప్పించి ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠించారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈక్రమంలో కొందరిని బాధ్యులను చేస్తూ రిపోర్టు రాశారు. వీటితో పాటు 2013లో జరిగిన కొన్ని అవినీతి అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..