Tirupati News: అతడు... కారు కనిపిస్తే రాళ్లేస్తాడు...
ABN , Publish Date - Nov 22 , 2025 | 09:59 AM
ఆయన.. కారు కనిపిస్తే చాలు... రాళ్లేసి అద్దాలు పగులగొడతాడు.. ధ్వంసం చేస్తాడు. అయితే.. అతను ఇలా చేయడాని కారణం అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడమేనని తెలుస్తోంది. స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
- తిరుపతిలో మానసిక రోగి విధ్వంసం
తిరుపతి: అతడికి మానసిక స్థితి సరిగాలేదు. కార్లు కనిపిస్తే చాలు.. వాటిపై రాళ్లు వేసి ధ్వంసం చేస్తున్నాడు. గతంలో కారు ఘటన ఏదో ఇతడిని కలవరానికి గురిచేయడమే కారణమని అలిపిరి పోలీసులు అంటున్నారు. ఇలా దాడికి పాల్పడే వ్యక్తిది తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి. తల్లిదండ్రులతో కలిసి మంగళంలో ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ఫుల్లుగా మద్యం తాగి.. తిరుపతి నగరం మధురానగర్‌లోకి వచ్చాడు. ఓ ఇంటి ముందు ఆపి ఉన్న కారుపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశాడు.

ఆ తర్వాత దుకాణాలపైన రాళ్లు విసిరాడు. దీంతో ఐదారు దుకాణాల తలుపులు, షట్టర్లు దెబ్బతిన్నాయి. ఈ రాళ్ల దాడిలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ఈ విధ్వంసాన్ని గమనించిన సీపీఎం నేత కందారపు మురళి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. అలిపిరి ఎస్‌ఐ అజిత, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మానసిక రోగి కావడంతో విచారించి అతడి తల్లితండ్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు.
తరచూ ఇలాంటి ఘటనలే
ఈ మానసిక రోగే అని కాదు.. మధురానగర్‌లో పలుమార్లు తాగుబోతులు కూడా ఇలాంటి విధ్వంసాలకే పాల్పడ్డారు. ఆరు నెలల కిందట ఇక్కడ నివాసమున్న ఇద్దరు ఫొటో జర్నలిస్టుల ద్విచక్ర వాహనాలను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని మందుబాబులు బండ రాళ్లతో ధ్వంసం చేశారు. వినాయక ఆలయం వద్దనున్న రెండు మున్సిపల్ కాంప్లెక్సుల వద్ద రాత్రి 10 గంటలైతే చాలు కొందరు బహిరంగంగా మద్యం తాగుతూ దారిన పోయేవాళ్లను వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లు స్థానికులు చెప్పారు. దీంతో ఆ దారిన వెళ్లాలంటే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News