Tirumala Electric Buses: Tirumala Electric Buses: తిరుమలలో ఇక పూర్తిగా విద్యుత్ బస్సులే...
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:49 PM
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పూర్తిగా విద్యుత్ బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న డీజల్, పెట్రోల్ ట్యాక్సీలు, టీటీడీ అద్దెవాహనాలను దశలవారీగా రద్దు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- దశలవారీగా డీజల్, పెట్రోల్ ట్యాక్సీలు, టీటీడీ అద్దెవాహనాల రద్దు
- టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల: తిరుమలలో పూర్తిగా విద్యుత్ వాహనాలనే వినియోగంలోకి తీసుకురావడానికి విస్తృత చర్యలు చేపట్టినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary) తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పవిత్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా రద్దు చేయనున్నట్టు వివరించారు. తొలిగా తిరుపతి, తిరుమల మధ్య పూర్తిగా విద్యుత్ బస్సులు మాత్రమే నడిచే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

తిరుమలలో నడిచే ట్యాక్సీలు, టీటీడీ అద్దె వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను దశలవారీగా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. త్వరలో జరుగనున్న టీటీడీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధి కునాల్ జోషి వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో టీటీడీ డీఎ్‌ఫవో ఫణికుమార్ నాయుడు, వీజీవో సురేంద్ర, ఐటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు నాయుడు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News