Share News

North Andhra Pradesh: పిడుగులు వడగాల్పులు

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:53 AM

రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, కోస్తా, రాయలసీమలో వడగాల్పులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా పిడుగులు, వడగాల్పులు కూడిన వాతావరణం కొనసాగనుంది

North Andhra Pradesh: పిడుగులు వడగాల్పులు

  • నేడు ఉత్తరాంధ్రలో భిన్న వాతావరణం

  • రేణిగుంటలో 42.8 ఉష్ణోగ్రత నమోదు

  • కోస్తా, సీమల్లో చెదురుమదురుగా వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రంగా కాసింది. మరోవైపు ఉపరితలద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఆదివారం కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో ఓ వైపు వడగాడ్పులు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 42.6, కడప జిల్లా అట్లూరులో 42.3, పల్నాడు జిల్లా కాకానిలో 41.6, అన్నమయ్య జిల్లా కంభాలకుంటలో 41.5, చిత్తూరు జిల్లా నగరిలో 41.4, నెల్లూరు జిల్లా జలదంకిలో 41.3, నంద్యాల జిల్లా పాములపాడులో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 20 , 2025 | 03:53 AM