Share News

Pithapuram: పవన్‌ను కించపరిచేలా పోస్టులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 06:12 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు.

Pithapuram: పవన్‌ను కించపరిచేలా పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురి అరెస్టు

పిఠాపురం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్న ఫొటోలను పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా మార్ఫింగ్‌ చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై జనసేన నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానానికి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్టణం మండలం వలందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ సింగరేణి కాలనీకి చెందిన షేక్‌ మహబూబ్‌లను అరెస్టు చేశారు.

Updated Date - Jun 25 , 2025 | 06:12 AM