Share News

Chirala Municipality: టీడీపీ ఖాతాలో చీరాల మున్సిపాలిటీ

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:20 AM

బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్‌గా మించాల సాంబశివరావు ప్రమాణం చేశారు..

Chirala Municipality: టీడీపీ ఖాతాలో చీరాల మున్సిపాలిటీ

  • చైర్మన్‌గా సాంబశివరావు ఏకగ్రీవ ఎన్నిక

  • ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం

చీరాల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్‌గా మించాల సాంబశివరావు ప్రమాణం చేశారు. గత మే 14న మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబుపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం గెలుపొందింది. అయితే అప్పటికే జంజనం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనాటి నుంచి కొత్త చైర్మన్‌ ఎంపికపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే పార్టీ అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌లో కొత్త చైర్మన్‌ పేరును బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారఽథి, ఎంపీ కృష్ణప్రసాద్‌ ద్వారా కౌన్సిల్‌కు అందజేసింది. బుధవారం మున్సిపల్‌ సమావే శం ప్రారంభం కాగానే చైర్మన్‌ అభ్యర్థిగా 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మించాల సాంబశివరావు పేరును అఽఽధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి 20 మంది కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు ఐదుగురు, అలాగే ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే మద్దతు తెలపడంతో 27 ఓట్లు మెజారిటీతో ఆయన చైర్మన్‌గా గెలిచారు. ప్రిసైడింగ్‌ అధికారులు డీఆర్‌వో గంగాధర్‌, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయు డు మించాలకు నియామకపత్రం అందజేయడంతో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - Jul 17 , 2025 | 05:20 AM