CJI Tirumala Visit: తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:14 AM
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
తిరుమల, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి శనివారం రాత్రి 8.15 గంటలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా రాత్రికి తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా.. శనివారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతీ దేవిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా దంపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News