Share News

Sunil Kumar Yadav : ‘హత్య’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలి!

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:36 AM

హత్య సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు యాదాటి సునీల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Sunil Kumar Yadav : ‘హత్య’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలి!

  • వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌కుమార్‌ డిమాండ్‌

  • పులివెందుల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

పులివెందుల టౌన్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తనను, తన తల్లిని అవమానించే విధంగా హత్య సినిమాను తీశారని, ఆ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు యాదాటి సునీల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం పులివెందుల పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ నరసింహులుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హత్య సినిమాను తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రించారన్నారు. కోర్టులోనూ దీనిపై ప్రైవేటు కంప్లయింట్‌ చేస్తామని చెప్పారు. ప్రాణహాని ఉందని గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని, న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..


Updated Date - Jan 26 , 2025 | 04:37 AM