Bojjala Sudheer Reddy Denies: దేవుడి సాక్షిగా చెప్తున్నా..రాయుడు హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:11 AM
శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జి కోటా వినూత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియస్ ..

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి
తిరుమల, జూలై17(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జి కోటా వినూత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియస్ రాయుడు హత్య కేసుపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తొలిసారిగా తిరుమలలో స్పందించారు. ‘ఈ విషయంపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు కానీ, మొదటిసారి స్పందిస్తున్నా. గుళ్లో ఉన్నాం. నాకూ కుటుంబం.. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. దేవుడి సాక్షిగా, నా కుటుంబం సాక్షిగా చెప్తున్నా. నాకు.. రాయుడి హత్యతో ఎటువంటి సంబంధం లేదు’ అని చెప్పారు. తిరుమల శ్రీవారిని గురువారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రాజకీయ కోణంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ అనవసరంగా తనను ఈ వ్యవహారంలోకి లాగి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందన్నారు. దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నానని, తనకు ఆ హత్యతో ఎటువంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు. కాగా, శ్రీనివాసులు హత్య కేసులో నిందితురాలిగా ఉన్న వినూత దంపతులు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా సుధీర్‌రెడ్డి కుట్రేనని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్