Rammohan Naidu Google Investment: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:45 PM
డేటా సెంటర్‌కు అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇండస్ట్రీలు వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేక పోతున్నారని.. విమర్శిస్తున్నారని మండిపడ్డారు
శ్రీకాకుళం, అక్టోబర్ 18: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Central Minister Rammohan Naidu) అన్నారు. స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సూర్యభగవానుడి పరిసరాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేశామని.. 25 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. సైకిల్ ట్రాక్‌లు నగరంలో ఏర్పాటు చేస్తామని.. సైకిల్ ఫర్ సండే సైకిల్ రూట్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి అని.. న భూతో న భవిష్యత్ అంటూ పేర్కొన్నారు. గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. దీని ద్వారా 1,88,000 వేల ఉద్యోగాలు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా రానున్నాయన్నారు కేంద్రమంత్రి .
డేటా సెంటర్‌కు అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు. గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేక పోతున్నారని.. విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పెట్టుబడి తేలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో కూర్చుని బ్రాండ్ ఏపీ పేరును సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంతగా వారి అవివేకం, అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయన్నారు. అన్ని జిల్లాలకు ఐటీ విస్తరించాలని శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లస్టర్‌లు గుర్తించామని చెప్పారు. ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీలను అన్ని జిల్లాలకు తీసుకొస్తామన్నారు. నవంబర్‌లో సీఐఐ సమ్మిట్‌లో అనేక ఒప్పందాలు జరగనున్నాయని వెల్లడించారు. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేసి ఎయిర్పోర్ట్‌ను ముందుకు తీసుకువెళ్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
హోంమంత్రి పేరుతో బురిడీ.. మోసపోయిన శ్రీవారి భక్తులు
తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
Read Latest AP News And Telugu News