Share News

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:18 AM

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్‌సలో బుధవారం ప్రారంభమైంది.

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

నూజివీడు టౌన్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్‌సలో బుధవారం ప్రారంభమైంది. సోమ, మంగళ వారాల్లో నూజివీడు ఆర్కే వ్యాలీ అడ్మిషన్లు పూర్తి చేయగా, బుధవారం నుంచి శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సకు సంబంధించి అడ్మిషన్లు ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు 516 మంది విద్యార్ధులకు కాల్‌ లెటర్లు పంపగా 444 మంది సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. హాజరైన వారిలో బాలురు 127 మంది, బాలికలు 310 మంది అడ్మిషన్లు పొందినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ బాలాజీ తెలిపారు.

Updated Date - Jul 03 , 2025 | 04:18 AM