Share News

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:53 AM

గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.

Trains: గుంటూరు మీదగా.. కాకినాడ టౌన్‌, చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు: గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్‌, లింగంపల్లి(Cherlapalli, Kakinada Town, Lingampalli)కి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల(Guntur, Sattenapalli, Piduguralla) మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది. (07448) చర్లపల్లి - కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది.


nani1.2.jpg

(07445) కాకినాడ టౌన్‌ - లింగంపల్లి ప్రత్యేక రైలు జూలై 2 నుంచి మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.50కి లింగంపల్లి చేరుకొంటుంది. (07446) లింగంపల్లి - కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జూలై 3 నుంచి మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30కి బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదగా ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకొంటుందని సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 11:53 AM