Election order : 27న ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పెషల్ సీఎల్
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:33 AM
మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున(ఈ నెల 27) స్పెషల్ క్యాజువల్ లీవ్...

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున(ఈ నెల 27) స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చే యాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా విధులకు ఆలస్యంగా వచ్చేందుకు, లేదా పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకుని విధులకు హాజరయ్యేలా షిఫ్టులను సర్దుబాటు చేయాలని సీఈవో మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.