Share News

TDP Somireddy : గోదావరి వరదపై సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:09 AM

బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపధ్యంలో గోదావరి వరదపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TDP Somireddy :  గోదావరి వరదపై  సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Somireddy Chandramohan Reddy

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోని రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ నీరు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్లాన్‌ చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తమకు నష్టం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోంది.


బనకచర్ల ప్రాజెక్టు అమలైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు కొరత ఏర్పడుతుందని అభ్యంతరం చెప్పింది. వృథాగా పోతున్న గోదావరి వరద నీరు తెలంగాణకు కూడా అవసరం ఉందని పేర్కొంది.


కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావరి వరద నీరు వృథాగా పోతుండటంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. బీఆర్ఎస్ నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా.. కనీసం కాంగ్రెసోళ్లు చెంబులతో అయినా ఆపండయ్యా.. అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. రోజుకు 50, 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


Also Read:

కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం

ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని

For More Andhrapradesh News

Updated Date - Jul 13 , 2025 | 11:44 AM