Share News

Investigation: సిట్‌ కస్టడీలో ‘కల్తీ నెయ్యి’ నిందితులు

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:19 AM

శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను సిట్‌ అధికారులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Investigation: సిట్‌ కస్టడీలో ‘కల్తీ నెయ్యి’ నిందితులు

తిరుపతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను సిట్‌ అధికారులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏ3 పొమిల్‌ జైన్‌, ఏ5 అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను 3 రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు సోమవారం తిరుపతి 2వ ఏడీఎం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం తిరుపతి సబ్‌ జైలు నుంచి ఆ ఇద్దరినీ సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారికి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. గురువారం వరకూ వీరు సిట్‌ అదుపులో ఉంటారు. వారిని సిట్‌ కార్యాలయం లో విశాఖ సీబీఐ డీఐజీ మురళీ రాంబా విచారిస్తున్నారు. పలుకోణాల్లో సమాచారం రాబట్టేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 05:19 AM