Share News

YS Jagan Convoy: సింగయ్య మృతి కేసులో కీలక మలుపు..

ABN , Publish Date - Jun 21 , 2025 | 09:07 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని సింగయ్య అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజా వీడియోల్లో ఆసక్తికర విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.

YS Jagan Convoy: సింగయ్య మృతి కేసులో కీలక మలుపు..

గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని సింగయ్య అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజా వీడియోల్లో ఆసక్తికర విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.


ఏటూకురు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని సింగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ప్రమాద సమయంలో వీడియోలో కనిపిస్తున్న వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. జగన్ పర్యటన రోజు లింగయ్యను ఢీకొన్న వాహనాన్ని ఎస్పీ నంబర్‌తో సహా చెప్పినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 21 , 2025 | 09:58 PM