CM Chandrababu: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు
ABN , Publish Date - Mar 03 , 2025 | 08:50 PM
CM Chandrababu: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి సాధన చిట్స్ పండ్స్‌ను పాలడుగు పుల్లారావు స్థాపించారు. నమ్మకంగా వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. అనంతరం బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు.

అమరావతి, మార్చి 03: నరసరావుపేటకు చెందిన సాయి సాధన చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్ని మోసం చేసిన వాళ్లు.. కోర్టులో లొంగిపోయామంటే సరిపోదని ఆయన పేర్కొన్నారు. బాధితులకు పూర్తి న్యాయం చేయాలని ఆయన తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన సాయి సాధన చిట్‌ఫండ్స్ బాధితుల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన కాన్వాయ్ ఆపారు.
Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా తమకు రూ. 250 కోట్లకు చిట్ ఫండ్స్ కంపెనీ శఠగోపం పెట్టిందంటూ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా బాధితులు వినతులు అందజేశారు. ఈ చిట్ ఫండ్స్ మోసం కారణంగా దాదాపు 600 బాధిత కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని సీఎం చంద్రబాబుకుకు బాధితులు వివరించారు. ఇక చిట్ ఫండ్స్ కంపెనీ అధినేత పాలడుగు పుల్లారావు 40 రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారని సీఎం దృష్టికి బాధితులు తీసుకు వెళ్లారు. దాదాపు 10 నిమిషాల పాటు.. సీఎం చంద్రబాబు బాధితల గోడును విన్నారు. అనంతరం వారి ఆవేదన చూసి సీఎం చంద్రబాబు పైవిధంగా స్పందించారు.
Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో సాయి సాధన చిట్స్ పండ్స్‌ను పాలడుగు పుల్లారావు స్థాపించారు. నమ్మకంగా వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. అనంతరం బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఇందులో నగదు పెట్టిన వారంతా లబోదిబోమన్నారు. ఆ క్రమంలో జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ ఫలితం లేకపోవడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.
Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్
కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో.. ఫిబ్రవరి 2వ వారంలో సాయి సాధన చిట్ ఫండ్స్ అధినేత పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఆ క్రమంలో గుంటూరు సబ్ జైలుకు అతడిని పోలీసులు తరలించారు. అయితే అతడి మాటలు నమ్మి.. కోట్లకు కోట్లు నగదు చిట్ ఫండ్స్‌లో పెట్టామని బాధితులు కన్నీరుమున్నీరవుతోన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
For AndhraPradesh News And Telugu News