Ramagiri SI: ఊడదీసేందుకు అరటి తొక్కా
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:04 AM
రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పారు, "పోలీసుల బట్టలు కష్టపడి సంపాదించుకున్నవి, అవి ఊడదీయడం సులభం కాదు

పుట్టపర్తి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘జగన్.. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటున్నావ్. అవి నువ్విచ్చినవి కాదు. మేం కష్టపడి సంపాదించుకున్నవి’ అని శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ అన్నారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ వ్యాఖ్యలపై ఆయన మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. కష్టపడి చదువుకుని, రన్నింగ్ రేస్‌లో వేలాది మందితో పోటీపడి పోలీసు ఉద్యోగాన్ని సంపాదించుకున్నామన్నారు. ‘నువ్వెవడో వచ్చి ఊడదీయడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడతాం. నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం. నిజాయితీగానే చస్తాం. అడ్డమైన దారులు తొక్కం. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి’ అని హెచ్చరించారు.