Quantum Computing:భావి యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్‌తోనే..సబ్‌మెరైన్ల నిర్వహణ కూడా: వక్తలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:38 AM
ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు..

అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ సింధూర్’ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు. భవిష్యత్‌లో యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతిక సహకారంతోనే ముందుకు సాగుతాయని తెలిపారు. విజయవాడ వర్క్‌షాపులో క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్‌పై జరిగిన చర్చాగోష్ఠిలో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక నైపుణ్య సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. భారీ ఆర్థిక లావాదేవీలు .. డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుల సేవలు, ఔషధాల నమూనాలు, విద్య, వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు వేగవంతం కానున్నాయని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ హెడ్ డాక్టర్ వెంకట ఎల్.సుబ్రహ్మణ్యం చెప్పారు.
భవిష్యత్ యుద్ధాలన్నీ మానవ రహిత క్షిపణులు, డ్రోన్ల సహకారంతోనే జరుగుతాయని విశాఖ ఎన్‌ఎ్‌సటీఎల్-డీఆర్‌డీవో శాస్త్రవేత సాజీ వీఎఫ్ వెల్లడించారు. డ్రోన్ల సహకారంతో శత్రుదేశ స్థావరాలు, ఆయుధాల ధ్వంసం, సైనికులపైనా పైచేయి సాధించేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు.