Share News

Puttaparthy: మీకు తెలుసా.. నాటి గొల్లపల్లియే.. నేటి పుట్టపర్తి

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:55 AM

ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లిగా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది.

Puttaparthy: మీకు తెలుసా.. నాటి గొల్లపల్లియే.. నేటి పుట్టపర్తి

(ఆంధ్రజ్యోతి, పుట్టపర్తి)

ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లి(Gollapalli)గా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది. అక్కడ ఉన్న పుట్ట వద్ద నిలబడి ఓ పాముకు పాలిచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చాక అది పాలివ్వకపోవడంతో యానిమానికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన రహస్యంగా ఆ ఆవు వెంట వెళ్లాడు.


pandu4..2.jpg

యథాప్రకారం ఆ ఆవు ఓ పుట్టవద్దకు వెళ్లి పాముకు పాలివ్వడం ప్రారంభించింది. దీన్ని గమనించిన యజమాని కోపంతో ఆవును కొట్టబోయి పామును కొట్టాడు. దీంతో పాము రక్తసిక్తమయింది. దాని పాపమో, శాపమో గాని అప్పటి నుంచి గోపాలవంశం నశించిపోయింది. పాము చనిపోయిన తర్వాత గొల్లపల్లి గ్రామమంతా పుట్టలు వెలిశాయి. దీంతో ఆ గొల్లపల్లి కాలక్రమేణ పుట్టపర్తి(Puttaparthy)గా మారింది. చిన్న గ్రామంగా ఉన్న పుట్టపర్తి సత్యసాయిబాబా అవతరించడంతో ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా మారింది.


pandu1.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 11:55 AM