Posani Krishna Murali: పోసానికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:37 PM
Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

విజయవాడ, మార్చి 11: విజయవాడ, మార్చి 11: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
2024, నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్‌లో పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఎన్‌ఎస్ 353(1),353(2),353(సి)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.
Also Read: చింతకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు.ఇటీవల పీటీ వారెంట్‌పై కోర్టులో పోసానిని హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది.
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకు పడ్డారు.
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని.. ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవడం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
అదీకాక పోసానికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ.. పోసానికి బెయిల్ మంజూరు అయింది.
For AndhraPradesh News And Telugu News