Share News

AP police : పేర్ని జయసుధ బెయిల్‌ రద్దు చేయండి

ABN , Publish Date - Feb 11 , 2025 | 06:11 AM

మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు ...

AP police : పేర్ని జయసుధ బెయిల్‌ రద్దు చేయండి

  • హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పేర్ని జయసుధకు నోటీసులు అందజేయాల్సి ఉందని, విచారణను వాయిదా వేయాలని పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌ కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.

Updated Date - Feb 11 , 2025 | 06:11 AM