Pawan Kalyan Latest Speech: నా పేరే పవనం.. అంతటా ఉంటా
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:32 AM
నియంత పోకడలు ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిని సినిమాలు

ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు
నియంత ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తిని సినిమాలు, అభిమానులే నాకిచ్చారు
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నియంత పోకడలు ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిని సినిమాలు, అభిమానులే తనకు ఇచ్చారని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. రెండేళ్ల కిందట విశాఖ నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా తనను ఇబ్బందులకు గురిచేసి, పోలీసు అధికారులు కాలిబూట్లతో తన్ని అరెస్టు చేయాలని చూడగా, నగరవాసులంతా హోటల్ ముందుకువచ్చి కూర్చున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటుచేసినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు. ఈ మాట తానంటే.. ఎక్కడికి వెళితే అక్కడ పవన్ అక్కడే పుట్టాను.. అక్కడే పెరిగాను..అని అంటుంటారని కొందరు విమర్శిస్తుంటారన్నారు. ‘‘నా పేరే పవనం... అంతటా ఉంటాను. మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు. బావిలో కప్పలు. వాళ్లు అంతకుమించి ఆలోచించలేరు.’’ అని పవన్ విమర్శించారు. సినిమాకు కుల, మత, ప్రాంత భేదాలు ఉండవన్నారు. సనాతన ధర్మం ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, అందరినీ ఆ ధర్మం కలుపుకొని పోతుందని పవన్ వెల్లడించారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!