Share News

Panchayat Raj Dept : పంచాయతీరాజ్‌లో పదోన్నతులకు కసరత్తు

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:49 AM

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌....

 Panchayat Raj Dept : పంచాయతీరాజ్‌లో పదోన్నతులకు కసరత్తు

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ ఆదేశాల మేరకు చర్యలు

  • నేడు ఉద్యోగ సంఘాలతో కమిషనర్‌ సమావేశం

  • అన్ని కేడర్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకారం

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌ కృష్ణతేజ చర్యలు ప్రారంభించారు. ఆ శాఖలో పదోన్నతుల ప్రక్రియపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో కమిషనర్‌ బుధవారం సమావేశం కానున్నారు. అన్ని కేడర్ల ఉద్యోగ సంఘాల నేతల సూచనలను, సలహాలను స్వీకరించనున్నారు. గతంలో పదోన్నతుల ప్రక్రియ ఒక ప్రహసనంలాగా ఉండేది. ఇప్పటి వరకు పదోన్నతుల కోసం వేసే డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) వేశాక ఏర్పడ్డ ఖాళీలకు మళ్లీ డీపీసీ ఏర్పాటుచేసే దాకా మోక్షం కలిగేది కాదు. ఉదాహరణకు సెప్టెంబరు నెలలో డీపీసీ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాక ఆ తర్వాత నెలల్లో ఖాళీ అయ్యే పోస్టులను మళ్లీ రెండేళ్ల తర్వాత డీపీసీ ఏర్పాటు చేసే వరకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది కాదు. కొందరు ఉద్యోగులు పదోన్నతులు లేకుండానే రిటైరవుతున్నారు. దీంతో ఈ ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రతి ఏటా డీపీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 200 ఎంపీడీఓ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

కమిషనరేట్‌లో సిబ్బంది కొరత లేకుండా..

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ వేగంగా కొనసాగించడానికి కమిషనరేట్‌లో సిబ్బంది కొరత లేకుండా చేయాలని కమిషనర్‌ నిర్ణయించారు. పీఆర్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో ఇప్పటికే ఐదుగురు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు. మరో నలుగురిని త్వరలో తీసుకోనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 05:49 AM