YSRCP: వైసీపీ ముఖ్య నేతకు బిగ్ షాక్.. అరెస్ట్ తప్పదా..?
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:24 PM
వైసీసీ కీలక నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పలాసలోని అప్పలరాజు నివాసంలో ఆయనకు నోటీసులు అందించారు పోలీసులు. మరి ఇంతకీ ఆయనకు నోటీసులు ఎందుకు ఇచ్చారు..
శ్రీకాకుళం, నవంబర్ 8: వైసీసీ కీలక నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పలాసలోని అప్పలరాజు నివాసంలో ఆయనకు నోటీసులు అందించారు పోలీసులు. మరి ఇంతకీ ఆయనకు నోటీసులు ఎందుకు ఇచ్చారు.. అసలు ఆయన ఏం చేశారు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు విపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిపై అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అప్పలరాజుపై టీడీపీ కార్యకర్త బూర్ల విజయకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ 2024లోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. సీదిరి అప్పలరాజుకు నోటీసులు ఇచ్చారు.
నోటీసులకు స్పందించిన అప్పలరాజు.. పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈ కేసులో అప్పలరాజును విచారించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:
అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..
పాముతో పరాచకాలా.. కోబ్రాతో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..