Online Betting Fraud: బ్యాంకుఖాతాలతో దందా!
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:58 AM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టును ప్రకాశం పోలీసులు రట్టు చేశారు..

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు
సేవింగ్స్ ఖాతాకు 25వేలు, కరెంటు అకౌంట్‌కు 40వేలు చెల్లింపు
విదేశీయులతో జట్టు కట్టి నెల్లూరు వాసి మోసాలు
ఒంగోలు క్రైం, జూలై 23(ఆధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టును ప్రకాశం పోలీసులు రట్టు చేశారు. అమాయకుల బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ప్రకా శం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ కథనం మేరకు.. కాంబోడియాలో ఉం టున్న వైట్, జిమ్మీ, మౌనికలతో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన షేక్ యాసిన్(ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం) చేతులు కలిపాడు. విదేశా ల్లో వినియోగంలో ఉన్న కొన్ని బెట్టింగ్ యాప్‌లను వీరు భారత్‌లో ప్రమోట్ చేశారు. ఈ ముఠా అంతా ఓ టెలిగ్రామ్‌లో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో వైట్, జీమ్మీ, మౌనిక, యాసిన్, నెల్లూరుకు చెందిన శ్యామ్, హైదరాబాద్‌లో ఉంటున్న ప్రణీత్‌తో పాటు మరి కొంతమందిని యాడ్ చేశారు. ఈ గ్రూప్ ద్వారా వ్యాపారం ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడేవారికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం చా లా బ్యాంకు ఖాతాలు అవసరం కావడంతో అమాయికులకు వల వేశారు. సేవింగ్స్ అకౌంట్‌కు రూ.25వేలు, కరెంట్ అకౌంట్‌కు రూ.45వేలు ఇస్తామని, ఖాతాదారులు తమ బ్యాంక్ పాస్‌బుక్, డెబిట్ కార్డు అప్పగించాల ని నిబంధన విధించారు. ఈ ఆఫర్‌కు ఆకర్షితుడైన ప్రణీత్ ఒంగోలులో నివాసం ఉంటున్న తన స్నేహితుడు నాయబ్ రసూల్‌కు విషయం చె ప్పాడు. రసూల్ తల్లి మస్తానమ్మ, ఒంగోలు పీర్లమాన్యంలో ఉంటున్న ఆయేషా కలిసి కొంతమందితో కర్ణాటక బ్యాంక్, ఐవోబీ, ఫెడరల్ బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిపించారు. కొంత సొమ్ము ముట్టజెప్పారు. వారి పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు నెల్లూరులో ఉంటున్న చైతన్యకు కొరియర్ ద్వారా చేర్చేవారు. అతను ఆ ఖాతాలకు నెట్ బ్యాంకింగ్‌ను సిద్ధంచేసి నగదు బదిలీలకు వినియోగించేవారు. పక్కా సమాచారంతో కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు 27 బ్యాంకు పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నాయబ్ రసూల్, ప్రణీత్, ఉదయగిరికి చెందిన సయ్యద్ షహిజాద్, సింగనబోయిన చైతన్య, షేక్.ఖాదర్‌న్నిస్సా, ఆయేషాను అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!