Ongole: నేడు ఒంగోలులో అక్షరమే అండగా సభ
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:01 AM
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా సభ శనివారం ఒంగోలులో జరగనుంది. ఈ ఏడాది జనవరి 28న ఒంగోలులోని 37వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ పార్కులో చర్చా వేదిక నిర్వహించారు.

హాజరుకానున్న ఎమ్మెల్యే దామచర్ల, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ ఆదిత్య
ఒంగోలు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ సభ శనివారం ఒంగోలులో జరగనుంది. ఈ ఏడాది జనవరి 28న ఒంగోలులోని 37వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ పార్కులో చర్చా వేదిక నిర్వహించారు. ఆ ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని పలు సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డివిజన్‌లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని, తక్షణ సమస్యలపై వెంటనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు.
దీనికి అనుగుణంగా సుమారు రూ.2కోట్లు విలువైన పనులను కార్పొరేషన్ ద్వారా చేపట్టారు. అందులో రూ.70లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటిలో ఎన్టీఆర్ పార్కు అభివృద్ధితో పాటు పలు కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయి. వీటిని శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. అనంతరం ఎన్టీఆర్ పార్కులో జరిగే ‘అక్షరమే అండగా..’ సభలో ఎమ్మెల్యే జనార్దన్, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొనున్నారు.