Vaddepalli Ramchander: నిమ్న వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేయాలి
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:32 AM
నిమ్నవర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు నిబద్దతతో పనిచేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు..

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్
విజయవాడ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నిమ్నవర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు నిబద్దతతో పనిచేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల నుంచి అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పోలీసులపై చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉన్నాయన్నారు. మూడు నెలలకొకసారి తప్పనిసరిగా జిల్లా స్థాయిలో విజిలెన్స్, మానటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. పూచీకత్తు లేని రుణాల మంజూరుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాంచందర్ కోరారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీ శ, సీపీ ఎస్.వీ.రాజశేఖర బాబు, డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ డీఆర్‌ఓ కావూరి చైతన్య, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి జి.మహేశ్వరరావు పాల్గొన్నారు.